telugu navyamedia
రాజకీయ

థానేకు ఏక్‌నాథ్‌ షిండే.. డ్రమ్స్‌ వాయించి గ్రాండ్‌ వెల్క‌మ్ చెప్పిన భార్య

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మంగళవారం ఠాణె వెళ్లగా ఆయన మద్దతుదారులు ఘనంగా ఆహ్వానించారు. శిందే భార్య లత.. డ్రమ్ములు వాయిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన తన మాజీ బాస్‌, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఠాక్రేకు కౌంటర్‌ ఇచ్చారు.

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేకు తన స్వస్థలంలో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం మంగళవారం సొంత నియోజకవర్గమైన ఠాణెకు వెళ్లారు.

ఈ సందర్భంగా స్థానిక శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. బ్యాండు, మేళాలు, బాణసంచా పేలుస్తూ శిండేకు ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి లతా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. షిండే రాక సందర్భంగా ఆమె ఇంటి వద్ద స్వయంగా డ్రమ్స్‌ వాయించి భర్తకు గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత హిందు హృదయ్‌ సమ్రాట్, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే, ధర్మవీర్‌ ఆనంద్‌ దిఘే ఆశీర్వాదంతో రాష్ట్రంలో శివసేన–బీజేపీ ప్రభుత్వం అస్థిత్వంలోకి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, ఏ ఒక్క శివసైనికుడికి కూడా అన్యాయం జరగదని నూతన ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

అలాగే ఆటో రిక్షా వేగానికి మెర్సిడెస్‌ వెనుకబడిపోయిందంటూ ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమే. ఈ ప్రభుత్వం ప్రతి వర్గానికీ న్యాయం జరిగేలా చూస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇది మా సొంత ప్రభుత్వమే.. మా కోసమే పనిచేస్తుంది అనేలా కొత్త సర్కారు నిర్ణయాలు ఉంటాయి. అదే గత ప్రభుత్వానికి మా సర్కారుకు తేడా” అని విమర్శించారు.

Related posts