telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ హాయంలో 40ల‌క్ష‌ల మంది డేటా చౌర్యం..

*డేటా చౌర్యం పై హౌస్ క‌మిటీ చైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
*రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే టీడీపీ కుట్ర‌
*టీడీపీ హాయంలో 40ల‌క్ష‌ల మంది డేటా చౌర్యం
*చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ..ఓట్ల తొల‌గించే కుట్ర జ‌రిగింది..
*సేవా మిత్ర యాప్ ద్వార ఇంటింటి స‌ర్వే చేసి ..
టీడీపీకి వ్య‌తిరేకంగా ఉన్న వారి ఓట్ల‌ను తొలిగించే కుట్ర‌
*అసెంబ్లీకి నివేదిక ఇస్తాం..స‌భ నిర్ణ‌యం ప్ర‌కారం చ‌ర్య‌లు

చంద్రబాబు హాయంలో వైసీపీకి చెందిన ఓటర్లను తొలగించేందుకు రాష్ట్రానికి చెందిన వ్యక్తుల డేటాను చోరి చేసిందని పెగాసెస్ పై ఏపీ ప్రభుత్వం నియమించిన శాసనసభసంఘం చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

బుధవారం నాడు చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశమైంది.హోమ్‌, ఐటీ శాఖల నుంచి హౌస్‌ కమిటీ సమాచారం సేకరించింది. ఈ క్రమంలో డేటా చౌర్యం జరిగిందని కమిటీ నిర్థారణకు వచ్చింది.

ఈ సమావేశం తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దీని వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉందని, గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే కుట్ర జరిగిందని గుర్తించింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు ఓట్లను తొలగించే ప్రక్రియ జరిగిందని, 40 లక్షల మంది ఓట్లను తొలగించే కుట్ర చేశారని భూమ‌న అన్నారు.

రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. దీని వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర కూడా ఉందన్నారు.

సేవా మిత్ర యాప్ ద్వార ఇంటింటి స‌ర్వే చేసి ..టీడీపీకి వ్య‌తిరేకంగా ఉన్న వారి ఓట్ల‌ను తొలిగించే కుట్ర జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మద్దాల గిరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts