telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు…ఇక యుద్ధమే!!

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. సమ్మెకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చలు జరిపారు. పీఆర్సీ సాధన సమితి తో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనియన్ నేతలు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని యూనియన్ నేతలు సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలోనే పీఆర్సీ సమితితో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడమే మంచిదని భావించామని కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎందుకు విలీనం అయ్యామా అనే ఆవేదన కలుగుతుందని అన్నారు.

ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నామా ఆర్టీసీ ఆధీనంలో ఉన్నమా అనేది తెలియడం లేదని ఆర్టీసీ వారు సమ్మెకు వెళ్లితే ప్రజలు రవాణా పరంగా ఇబ్బంది పడతారని అన్నారు.

ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే నేటి నుంచే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఈ సమావేశం అనంతరం మీడియాతో ఆర్టీసీ యూనియన్ నేతలు మాట్లాడారు…

Related posts