telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర..

*నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన అంతిమ‌యాత్ర‌
*పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు
*మంత్రి మేకపాటి భౌతికకాయానికి జనసంద్రం మధ్య జరుగుతున్న అంతిమయాత్ర

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి నెల్లూరు నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది.తడిచిన గుండెతో, తడారని కళ్లతో  మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు వీడ్కోలు పలుకుతోన్నారు.

మేకపాటి అంత్యక్రియలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ రోజు 11గంట‌ల‌కు నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలో ప్ర‌భుత్వ‌లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

గౌతమ్ రెడ్డి భౌతికకాయం కళాశాల గ్రౌండ్‌కు చేరుకున్న అనంతరం.. ప్రజలు స్థానికుల సందర్శనార్థం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

జొన్న‌వాడ‌, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డిసీ ప‌ల్లి, మ‌ర్రిపాడు, బ్రాహ్న‌ణ‌ప‌ల్లి మీదుగా ఉద‌య‌గిరికి అంతిమ‌యాత్ర చేరుకోనుంది. పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించి త‌మ ప్రియ‌త‌మ నేత‌కు అంతిమ వీడ్కోలు అభిమానులు పలుకుతున్నారు.

కాగా.. ఉద‌య‌గిరిలో జ‌రిగే మేకపాటి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం జగన్ కడపకు చేరుకోనున్నారు. కడప నుంచి హెలికాప్టర్‌లో ఉదయగిరి మేకపాటి కాలేజ్‌కు చేరుకొని.. అంత్యక్రియల్లో పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

కాగా, అంతిమయాత్రలో మేక‌పాటి గౌతం రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల‌ రామ‌కృష్ణారెడ్డి, మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు గోవ‌ర్థ‌న్ రెడ్డి, సంజీవ‌య్య‌లు పాల్గొన్నారు.

Related posts