telugu navyamedia
క్రైమ్ వార్తలు

డ్రగ్స్ పై డీజీపీ కీలక సమీక్ష.. చిట్టా తయారు చేసింది పోలీస్ శాఖ.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం కలిగిస్తున్నాయి. వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీస్ శాఖ. డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు కీలకచర్యలకు రంగం సిద్ధమయింది. డీజీపీ సమావేశం లో కీలక ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. డ్రగ్స్ అమ్మకందారులు, డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్న వారివివరాలను పొందుపరచిన పోలీస్ శాఖ.

గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం చేసింది పోలీస్ శాఖ. సినీ , రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం చేశారు.

డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘా కు కొత్త యాప్ ను రూపొందించిన పోలీస్ శాఖ. డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు కీలక చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.

Related posts