బార్సిలోనా నుంచి కీవ్ వెళ్తున్న ఉక్రెయిన్ విమానంలో పూటుగా మద్యం తాగిన ఓ మహిళ తోటి ప్రయాణికులపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాగిన మత్తులో సదరు మహిళ తాను వీదేశీయుల పక్కన కూర్చొబోనని జాత్యంహకార వ్యాఖ్యలు చేయడమే కాకుండా… తోటి ప్రయాణికులు ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి పాల్పడింది. ముగ్గురు విమాన సిబ్బంది వచ్చి చెప్పిన వినలేదు. సిబ్బిందితో పాటు మాజీ టివి వ్యాఖ్యాత లిడియ పాలింయాస్క్యాను కూడా ఆమె తోసివేయడం జరిగింది. ఆమె గోల భరించలేక పక్కన ఉన్న ఓ చైనీయుడు సీటు మారేందుకు యత్నించగా అతన్ని కూడా కొట్టింది. ఈ తతంగాన్నంతటినీ ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. విమానంలో న్యూసెన్స్ క్రియేట్ చేసి తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసిన సదరు మహిళను విమానం కీవ్ ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
previous post
next post