telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కరోనా సోకిందన్న ఉద్యోగికి మూడు నెలలు జైలు శిక్ష… !

karona

ఆఫీసుకు డుమ్మా కొట్టే ప్రయత్నంలో తనకు కోవిడ్ 19 సోకిందని చెప్పాడు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ ద్వారా ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించారు. దీంతో ఓ ఉద్యోగి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కుర్చోవాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంటి నుంచి పనిచేయడం ఇష్టం లేక తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆఫీసుకు ఫోన్ చేశాడు. దీంతో యాజమాన్యం అతడికి సెలవు ఇచ్చింది. రెండు రోజుల తర్వాత అతడు మళ్లీ ఆఫీసుకు ఫోన్ చేసి.. తనకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పాడు. దీంతో అతడిని ఆఫీసుకు రావద్దని, సెలవు తీసుకోవాలని బాస్ చెప్పాడు. అతడికి కరోనా వైరస్ నిర్ధరణ అయ్యిందని తెలియగానే ఆఫీసులో భయాందోళనలు నెలకొన్నాయి. మూడు రోజులపాటు సిబ్బందికి సెలవులిచ్చి ఆఫీసు మొత్తాన్ని శుభ్రం చేశారు. అనంతరం తన సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతడికి వ్యాధి ఎలా సోకింది? అతడు ఏయే ప్రాంతాల్లో తిరిగాడో తెలుసుకొని చికిత్సకు తరలించాలని భావించారు. ఈ సందర్భంగా అతడి ఇంటికి వెళ్లారు. విచారణలో భాగంగా పోలీసులు కరోనా వైరస్ సోకడానికి ముందు అతడు ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఓ షాపింగ్ మాల్‌లో కొంతమందిని కలిశానని, అందువల్లే వైరస్ సోకి ఉండవచ్చని తెలిపాడు. ఈ సందర్భంగా తాను షాపింగ్ మాల్‌కు వెళ్లినట్లుగా కొన్ని ఆధారాలు చూపించాడు. అవన్నీ ఫోర్జరీ చేసినవి తెలియడంతో వైద్య పరీక్షలు తరలించారు. రిపోర్టులో అతడికి కరోనా వైరస్ లేదని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులను, సంస్థను తప్పుదోవ పట్టించినందుకు మూడు నెలల జైలు శిక్ష పడింది.

Related posts