telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రద్దా బర్త్ డే సందర్భంగా.. సాహో చాప్టర్ 2.. ఆర్ యూ రెడీ !!

saaho movie team surprice on sradda birthday

ర‌న్ రాజా రన్ ఫేం సుజీత్ తెరెకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రం హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి కొద్ది రోజులుగా ఎలాంటి అప్‌డేట్స్ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్‌లో సినిమాపై ఆస‌క్తి మ‌రింత పెరుగుతూ పోతుంది. ఆ మ‌ధ్య షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 అంటూ సాహో చిత్ర బృందం ఓ వీడియో విడుద‌ల చేసింది. ఈ వీడియో అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లింది.

ఇక చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న శ్రద్దా క‌పూర్ బ‌ర్త్‌డే మార్చి 3న కావ‌డంతో ఆ రోజు సాహో టీం శ్ర‌ద్ధాకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ ఓ వీడియో విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్.

Related posts