telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీ కోరిక త్వరలోనే తీరుతుంది.. హీరోయిన్ కు ధనుష్ ఆఫర్

Dhanush'

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైన మాళవిక ప్రస్తుతం విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. గత నెల 28న హీరో ధనుష్ పుట్టినరోజు సందర్బంగా హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఈ భామ ధనుష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతనితో కలిసి నటించాలనే కోరికను బహిరంగంగా ప్రకటించింది. ఇక ధనుష్, మాళవికకు సమాధానం ఇస్తూ “నీ కోరిక త్వరలోనే తీరుతుంది” అని ధనుష్ చెప్పాడు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ‘డీ43’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌ని తీసుకుంటామని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Related posts