telugu navyamedia
సినిమా వార్తలు

‘బంగార్రాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ ఇదేనా..!

అక్కినేని నాగార్జున , నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు. . ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది . ఈ సంక్రాంతి సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో సందడి చేయబోతోంది.

‘మనం’ తర్వాత కుమారుడు నాగ చైతన్యతో ఈ సినిమాలో మరోసారి కలిసి నటించారు. మనంలో నాగార్జునకు చైతూ తండ్రిగా కనిపిస్తే.. ‘బంగార్రాజు’లో నాగార్జునకు చైతన్య మనవడిగా నటించారు. ఇందులో నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి సంద‌డి చేయ‌నుంది.

Bangarraju Is Already A Record

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘బంగార్రాజు’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకొచ్చాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేస్తున్న బంగార్రాజు సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది.

Bangarraju | Naga Chaitanya : బంగార్రాజు సెన్సార్ పూర్తి.. రెండు గంటల నలబై  నిమిషాల నిడివి..

అందుతున్న సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ థియోటర్ రైట్స్ 39 కోట్లు వరకూ అమ్ముడయ్యాయి. నాగార్జున, నాగచైతన్య కు ఉన్న మార్కెట్లు పరిగణనలోకి తీసుకుని అమ్మకాలు జరిగాయ‌ని తెలుస్తోంది.
నైజాం 11 కోట్లు
సీడెడ్ 6 కోట్లు
ఉత్తరాంధ్ర 4.14 కోట్లు
గుంటూరు 3.24 కోట్లు
ఈస్ట్ గోదావరి 2.88 కోట్లు
వెస్ట్ గోదావరి 2.60 కోట్లు
కృష్ణా 2.70 కోట్లు
నెల్లూరు 1.50 కోట్లు..మొత్తం 34 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు 2.50 కోట్లు
ఓవర్ సీస్ 2.50 కోట్లు ..మొత్తంc గా ప్రంపంచవ్యాప్తంగా 39 కోట్లు

Nagarjuna's Bangarraju Worldwide Pre-release Business - Downloadhub |  DOWNLOADHUB | Downloadhub 2022

ఆదివారం రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. సినిమాలోని పాటలన్నీ హిట్ అయిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు మేకర్స్.ఈ ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా ఈ నెల 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు .

ఈ ఈవెంట్‌కి నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు.

Related posts