telugu navyamedia
సినిమా వార్తలు

‘స్లీప్ పెరాలసిస్’ వ్యాధితో చాలా సార్లు బాధపడ్డా : విక్కీ కౌశల్

Vicky-Kaushal

‘ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో అతనిప్పుడు బిజీగా ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు విక్కీ తెలిపాడు. తాను ‘స్లీప్ పెరాలసిస్’ వ్యాధితో చాలా సార్లు బాధపడ్డానని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ‘మీరు నిజ జీవితంలో ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పాడు. తాను కొన్నిసార్లు ‘స్లీప్ పెరాలిసిస్‌’ను ఎదుర్కొన్నానని, అది చాలా భయంకరంగా ఉందన్నాడు. స్లీప్ పెరాలసిస్ అంటే.. నిద్రపోయే ముందు, లేదంటే నిద్ర నుంచి మేల్కొనే సమయంలో పక్షవాతం వచ్చినట్టుగా కొన్ని నిమిషాలు శరీరంలో చలనం ఉండకపోవడం. ఈ సమయంలో మనిషి ఏమీ వినలేడు. చూడలేడు. నిజంగానే ఇటువంటి బాధ ఎవరికీ రాకూడదని కోరుకుందాం.

Related posts