telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సైమా అవార్డుల వేడుక .. నామినేషన్లలో భారీ చిత్రాలు ..

sima awards celebrations and naminations

ఆగస్ట్ 15-16న సైమా ఎనిమిదవ అవార్డుల వేడుక ఖతార్‌లో జరగనుందని ప్రకటించారు. పాంటలూన్స్ రెండో సారి ఈ అవార్డుల టైటిల్‌ను స్పాన్సర్ చేస్తోంది. శ్రియా శరన్‌, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంటలూన్స్ మార్కెటింగ్‌, ఈకామర్స్ హెడ్ మిస్టర్ ర్యాన్ ఫెర్నాండెజ్ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. శాన్వి శ్రీవాస్తవ, అస్మిత నర్వాల్‌, నిధి అగర్వాల్‌, మాన్వితా కామత్‌, రుహాని శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సుధీర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు.

తెలుగులో టాప్ నామినేషన్స్

1. రంగస్థలం : 12 నామినేషన్స్
2. మహానటి: 9 నామినేషన్స్
3. గీత గోవిందం: 8 నామినేషన్స్
4. అరవింద సమేత: 6 నామినేషన్స్

తమిళంలో టాప్ నామినేషన్స్

1. 96 : 10 నామినేషన్స్
2. కోలమావు కోకిల : 7 నామినేషన్స్
3. వడ చెన్నై : 6 నామినేషన్స్

మలయాళంలో టాప్ నామినేషన్స్

1. సుదాని ఫ్రం నైజీరియా : 9 నామినేషన్స్
2. వరదన్ – 6 నామినేషన్స్
3. అరవిందంటె అదితికల్ : 5 నామినేషన్స్
4. పూమరం: 5

టాప్ నామినేషన్స్ ఇన్ కన్నడ

1. కేజీఎఫ్ చాప్టర్ 1 : 12 నామినేషన్స్
2. తగరు : 11 నామినేషన్స్
3. సర్కారి హి. ప్ర. షాలే, కాసరగోడు, కొడుగె : రామన్న రాయి 10 నామినేషన్స్

ఈ ఏడాది కూడా షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను సైమా హోస్ట్ చేస్తోంది.

గత మూడేళ్లుగా పలువురు వర్ధమాన ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి వచ్చి సక్సెస్‌లు కొట్టడాన్ని సైమా గుర్తిస్తూనే ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల గురించి విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ “యంగ్ ఫిల్మ్ మేకర్స్ లో ఉన్న టాలెంట్‌ను బయటకు తీసుకురావడానికే ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టాం. వీటి వల్ల ఫ్రెష్ థాట్స్, టెక్నిక్స్ ని ప్రోత్సహించిన వాళ్లం అవుతాం. 2018లో వేరియస్ ఫ్లాట్‌ఫార్మ్స్ లో పోస్ట్ అయిన షార్ట్ ఫిల్మ్స్, వాటికి వచ్చిన వ్యూస్‌, వాటికి వచ్చిన కామెంట్లు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని నామినీటలను ఫైనలైజ్ చేస్తాం. ప్రతి కేటగిరీలోనూ ఎంపిక చేసిన నామినేషన్లను జ్యూరీ ముందు ఉంచుతాం. వాళ్ల ద్వారా విన్నర్‌లను సెలక్ట్ చేస్తాం. విబ్రి మీడియా ప్రస్తుతం హిందీలో `83` చిత్రాన్ని, `జయ` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే“ అని తెలిపారు.

Related posts