telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ప్రయత్నిస్తున్నాను సర్…” పూరీకి వార్నర్ రిప్లై

Puri

ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఇటీవలే “బుట్టబొమ్మ” పాటకు టిక్ టాక్ వీడియో చేశారు. ఆ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎడమచేతివాటం ఓపెనర్ తాజాగా పోకిరి చిత్రంలో మహేశ్ బాబు హిట్ డైలాగ్ “ఒక్కసారి కమిటైతే” అంటూ మరో వీడియో చేశాడు.

 

View this post on Instagram

 

Guess the movie?? I tried everyone 🤷🏼‍♂️🤷🏼‍♂️Good luck 😂😂 #tollywood #requested #helpme #

A post shared by David Warner (@davidwarner31) on

దీనిపై స్పందించిన పోకిరి చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ వార్నర్ నటన బాగుందని, తన చిత్రంలో ఓ అతిథి పాత్ర ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. పూరీ ఆఫర్ పట్ల డేవిడ్ వార్నర్ వెంటనే స్పందించాడు. “నేను కూడా ప్రయత్నిస్తున్నాను సర్. అయితే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నన్ను వదులుకుంటుందో లేదో చూడాలి. లేకపోతే సన్ రైజర్స్ నుంచి నన్ను విడిపించేందుకు మీరే ఏదైనా బేరం కుదుర్చుకోవాలి” అంటూ చమత్కరించాడు. వార్నర్ ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో కాంట్రాక్టులో ఉన్న సంగతి తెలిసిందే.

Related posts