telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబ‌ర్ 26, ఆదివారం రాశిఫ‌లాలు

మేషరాశి..

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. ధ‌న‌, వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారం మంద‌కొడిగా సాగుతాయి.

వృషభరాశి..

ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు ఎంతో సరదాగా గడుపుతారు. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మిత్రులు, కుటుంబసభ్యులతో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి.

మిథునరాశి..

పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్య సమస్యలు త‌లెత్తుతాయి. బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆస్తి గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుకుంటారు.

కర్కాటకరాశి..

స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు.చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. విందువినోదాలు పాల్గొంటారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

సింహరాశి..

కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వేడుకలు, పార్టీల వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. మీ బంధువుల్లో ఒకరు మీకు అండగా నిలుస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం క‌నిపిస్తుంది.

కన్యరాశి..

మీకు బాగా నచ్చిన వ్యక్తులతోనే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. గొడవలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మీరు మౌనంగా ఉండడం మేలు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్ప‌డుతుంది. దైవదర్శనాలు చేస్తారు. వాహన, గృహయోగాలు క‌లుగుతుంది.

తులరాశి..

మిమ్మల్ని అభిమానించే వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామి మద్దతు పొందుతారు. బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధన న‌ష్టం క‌లుగుతుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో శ్రమ తగ్గుతుంది. . కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగుల్లో ఒత్తిడులు ఏర్ప‌డుతుంది.

వృశ్చికరాశి..

కాస్త ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ప్రాణ స్నేహితులతో గొడవలు ఏర్పడి.. విడిపోయే అవకాశం ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్ధులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు కలిసివస్తాయి.

ధనుస్సురాశి..

ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాలలో అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

మకరరాశి..

సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. పట్టుదలతో వ్యవహరించండి. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. రాబడికి మించి ఖర్చులు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభరాశి..

మీ వైవాహిక జీవితంలో తగాదాలు ఏర్ప‌డే అవకాశం ఉంది. ఉద్యోగంలో అద్భుతమైన విజయం సాధిస్తారు.అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పనులు వాయిదా వేస్తారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి.

మీనరాశి…

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగపరంగా కలిసివస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకుంటారు. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఏర్ప‌డుతుంది. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది.

Related posts