ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. జగన్ వి ఒంటెద్దు పోకడలని, శాసనమండలి రద్దు భావ్యం కాదని ఆమె విమర్శించారు. పీపీఏల రద్దు నుంచి రాజధాని మార్పు నిర్ణయం వరకు జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడంలేదని ఆమె విమర్శించారు..
బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీతో తప్ప తమకు మరే ఇతర పార్టీతోనూ పొత్తు లేదని, రాష్ట్రంలో తాము జనసేనతోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
అందుకే కవిత ఓడిపోయింది: జీవన్‌రెడ్డి