telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆ దేశంలో కరోనా పేరు పలికితే జైలుకే!

Turkamenistan

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న రోనా వైరస్ తుర్కెమెనిస్థాన్ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది. మీడియా వార్తల్లో ఆరోగ్య శాఖ పంపిణీ చేసే సమాచార పత్రాల్లోనూ ఈ పదం కనిపించరాదని ఆదేశించింది.

ఇక ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. రహస్యంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది గమనించడమే వీరి విధి. వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే ఇక చిక్కులు తప్పవు. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుస్తోంది.

తుర్కెమెనిస్థాన్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పౌర ఉద్యమాలను నిషేధించిన సర్కారు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. తమ దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్నిఅధికారులు జాగ్రత్తలూ తీసుకున్నారని తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడో వెల్లడించారు.

Related posts