telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

అతి నిద్రే….కరోనాకు అసలైన వాక్సిన్ !

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. అయితే కరోనా కు అసలైన మందు కంటి నిద్ర అని ఓ సర్వే లో తెలింది. అవును..అదెలాగో ఇప్పుడు చూద్దాం.. తగినంత నిద్ర పోయేవారికి శారీరకంగా, మానసికకంగా లాభాలు ఉంటాయి. మంచి నిద్ర వల్ల కరోనా.. సోకే ప్రమాదం తగ్గుతుందని ఓ సర్వే లో తేలింది. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల వల్ల కరోనా వైరస్ సులువుగా సోకుతుందని… వాటి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని ఆ సర్వే లో పేర్కొన్నారు. 40% మందికి నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లతోనే కరోనా సోకినట్లు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోని కరోనా రోగులపై చేసిన సర్వేలో తేలింది. కాబట్టి ఇప్పటికి అయినా.. ప్రతి ఒక్కరూ కంటి నిండా నిద్ర పోవడం చాలా మంచిది. మంచి నిద్ర పోయి.. కరోనా చెక్ పెట్టచ్చు.

Related posts