telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

వూ 100 అంగుళాల సూపర్‌ టీవీ .. భారత మార్కెట్‌లోకి.. 8 లక్షలే..

vu 100inch super tv launched in india

వూ కంపెనీ ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్‌ఈడీ టీవీ భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది, దీనికి అప్‌గ్రేడెడ్‌గా వూ 100 సూపర్‌ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ 100 అంగుళాల 4 కె సూపర్ టీవీ ధర అక్షరాలా రూ. 8 లక్షలు.

వూ 100 సూపర్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే; 100 అంగుళాల 4 కె డిస్‌ప్లే, ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆధారం, ఇంటెల్ కోర్ ఐ 3 , కోర్ ఐ 5 ప్రాసెసర్ ఆప‍్షన్స్‌, 4 జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్‌ స్టోరేజ్. టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్‌ కాల్స్, వైర్‌లెస్‌ క్వార్ట్లీ కీబోర్డ్‌, ఎయిర్ మౌస్‌, రిమోట్ కంట్రోల్‌, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్‌ టీవీ కనెక్టివిటీ పరగా, మూడు యుఎస్‌బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్‌డిఎంఐ, ఎవి, వైపిబిపిఆర్, ఆర్‌ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీకి చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వూ టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్‌ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక-నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు.

Related posts