ఏపీ సీఎం చంద్రబాబుని ప్రముఖ హాస్య నటుడు అలీ కలిశారు. కృష్ణా జిల్లాలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు బాబుతో అలీ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఏకాంతంగా అరగంటపాటు అలీ మాట్లాడారు. ఈరోజు ఉదయంజనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.
ఏపీ రాజకీయాల్లో కీలకనేతలను కొన్ని గంటల వ్యవధిలోనే అలీ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నెల 9వ తేదీన వైసీపీలో అలీ చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ని అలీ భేటీఓకే రోజు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.