telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముఖ్యమంత్రి త‌న స్వార్థప్రయోజనాల కోసం పోలవరం తాకట్టు ..

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్థప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టు పెడుతున్నారని మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమా అన్నారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని విమర్శించారు. డీపీఆర్-2కు సంబంధించి రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపితే, 28 మంది మంత్రులు ఉండి కూడా ఎందుకు ఆర్థిక అనుమతులు పొందలేకపోయారు..? అని ప్రశ్నించారు.

పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఉమా అన్నారు. దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని దేవినేని ఉమా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు

నిర్వాసితులను ద్రోహంచేసే హక్కు సీఎం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రివర్స్ డ్రామా ఆడకుండా ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. పునరావాసం కింద దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి పర్యటనలో రూ.47,725కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటి అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఏం మాట్లాడతారు, కేంద్రమంత్రి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తుంటే మంత్రులు కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగారంలాంటి డ్యామును ఎత్తిపోతల పథకంగా మార్చి తన తండ్రి విగ్రహం పెట్టుకునేందుకు సీఎం తప్పుడు పనులు చేస్తున్నారని విమర్శించారు.

Related posts