ఏపీలో నిర్వహించే లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. శాసనసభ స్థానాలకు 50 మందిని సాధారణ అబ్జర్వర్లుగా రాష్ట్రానికి పంపనుంది. అటు 25 లోక్‌సభ స్థానాలకు మరో 25 మందిని కేటాయించింది.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు అబ్జర్వర్లుగా 13 మంది ఐపీఎస్‌లను రాష్ట్రానికి పంపింది. ఈ నెల 25వ తేదీ నుంచి వీరంతా రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితి, ప్రచారం, సరళిని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం సరికాదు: డీజీపీ గౌతమ్ సవాంగ్