telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్‌లో కాల్పులకు రష్యా తాత్కాలిక బ్రేక్‌..

ఉక్రెయిన్​పై క్షిపణులు, బాంబులతో గత కొద్ది రోజులుగా ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా   రష్యా తాత్కాలిక బ్రేక్ వేసింది. మానవతా సాయం కింద పౌరులను తరలించేందుకు అవకాశం కల్పించింది.

మనవతా కారిడార్ కోసం వోల్నావఖా, మరియుపోల్‌లో ప్రాంతాల్లో కాల్పులను విరమించినట్టు ప్రకటించింది.. ఈ రెండు నగరాలను రష్యా సేనలు ఇప్పటికే ముట్టడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపు కోసం కాల్పులను తాత్కాలికంగా విరమిస్తున్నట్టుగా రష్యా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉండనుందని రష్యా ప్రకటించింది. శనివారం సాయంత్రం నుంచి కాల్పులు కొనసాగుతుందని తెలిపింది.

కాగా..గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ దురాక్రమణలో ఇప్పటి వరకు మొత్తం 500 క్షిపణులు ప్రయోగించింది రష్యా. రోజుకు రెండు డజన్లకుపైగా వివిధ రకాల మిసైల్స్​ను ప్రయోగిస్తున్నట్లు పెంటగాన్​ అధికారి ఒకరు తెలిపినట్లు కీవ్​ మీడియా తెలిపింది.

Related posts