telugu navyamedia
రాజకీయ వార్తలు

క్రికెట్ మ్యాచ్ లకు వాయు కాలుష్యం అడ్డుకాకూడదు: కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

వచ్చే నెల 3న ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢిల్లీలో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో వాతావణ కాలుష్య స్థాయి భారీగా పెరిగింది. కాలుష్యం కారణంగా ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని చెప్పారు.

ఢిల్లీలో తొలి టీ20 జరగాలని కేజ్రీవాల్ ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్ లకు వాయు కాలుష్యం అడ్డుకాకూడదని అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక మ్యాచ్ లు జరిగాయని చెప్పారు. మ్యాచ్ కు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నందున కాలుష్యం అదుపులోకి వస్తుందని తెలిపారు. మరోవైపు, బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు.

Related posts