telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గూగుల్ లో .. బికారికి అడ్రెస్స్ లా … పాక్ ప్రధాని .. వైరల్ …

another tech mistake in google search engine

గూగుల్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది, టెక్నికల్ గా తప్పైనప్పటికీ ప్రచారం మాత్రం జరిగిపోతుంది. ఇటీవల గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ‘బికారి’ అని టైప్ చేస్తే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. అందులోనూ ఇమ్రాన్ ఖాన్ ఓ సత్తు గిన్నె పట్టుకుని దీనంగా యాచిస్తున్న ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ‘బికారి’ గురించే చర్చించుకుంటున్నారు.

గతంలో ‘ఇడియట్’ అని టైప్ చేస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు ప్రత్యక్షమయ్యేవి. ఇప్పుడు ‘ఇడియట్’ స్థానాన్ని ‘బికారి’ ఆక్రమించింది. దీనికి కారణం గూగుల్ ఆల్గోరిథమ్ లో సమస్య అని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా టెక్నికల్ మిస్టేక్స్ కూడా నిజజీవిత సత్యాలను స్పష్టంగా చెపుతున్నాయి!!

Related posts