telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్..

*కీవ్‌ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ర‌ష్యా బ‌ల‌గాలు..
*ఇత‌ర దేశాలు జోక్యం చేసుకుంటే స‌హించేది లేదు..
*పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్ర‌క‌టించిన పుతిన్‌..
*యుద్ధం ఆప‌డం ఐరాస బాధ్య‌త -ఉక్రెయిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం ప్రకటించారు. డోన్భాస్‌లో ఉక్రెయిన్‌ బలగాలు ఉక్రెయిన్ మిలిటీరీ, తమ ఆయుధాలను అప్పగించి తక్షణం లొంగిపోవాలని తెలిపారు..

ఈ సందర్భంగా పుతిన్ అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు చేశారు.. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించాడు.రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే.. ‘ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే ఉద్ధేశ్యం రష్యాకు లేదన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్‌ పాలకులే బాధ్యత వహించాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లో పౌరులకు రక్షణకు మిలటరీ ఆపరేషన్‌ మొదలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చవద్దనేది తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు.

పుతిన్ ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో పేలుడు సంభవించింది. రష్యా సైనిక దళాలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Thumbnail image

రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా అంతర్జాతీయా కథనాలు రాసింది. తూర్పు ఉక్రెయిన్‌ అంతటా రష్యా బాంబుల దాడిలతో అట్టుడికినట్లుగా పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపుల వల్లే ఈ చర్య తీసుకున్నామని పుతిన్ ప్రకటించారు.

ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్‌ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. మరో వైపు పుతిన్‌ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయ్యింది.

Related posts