telugu navyamedia
తెలంగాణ వార్తలు

భ‌ద్రాచ‌లం గోదావ‌రి బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ శాంతి పూజ‌..

*భద్రాచ‌లంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌
*గోదావ‌రి బ్రిడ్జి ని ప‌రీశించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి పూజలు నిర్వహించారు. గోదావరి ప్రవాహాన్ని బ్రిడ్జిపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.

వరద తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట కల్గించిందని, 70 అడుగులు దాటిన గోదావరి వరద పరిస్థితిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి.

షెడ్యూల్‌ ప్రకారం హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రోడ్డు మార్గాన ఆయన భద్రాచలం చేరుకున్నారు. వరద నీటిలోనే ఆయన కాన్వాయ్ వెళ్లడం గమనార్హం. 

kcr, chief minister, bhadrachalam, telangana

సీఎం వెంట మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలించనున్నారు.

అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని వరద బాధితులను పరామర్శిస్తారు.  భద్రాచలం పట్టణం నీట మునగకుండా కరకట్ట ఎత్తును మరింత పెంచాలని స్థానికులు ఈ సందర్భంగా కేసీఆర్ ను కోరనున్నారు.అనంతరం అధికారులతో కేసీఆర్ సమీక్ష చేయనున్నారు

Related posts