telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ అసెంబ్లీకి తాకిన కరోనా సెగ.. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు పాజిటివ్‌

Telangana assembly hyd

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో… ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొన్న మండలికి హాజరైన పురాణం సతీష్‌…మండలిలో శనివారం మాట్లాడారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా సభ్యులు కలవరపడుతున్నారు. అటు రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 337 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 181 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,455 కు చేరగా.. రికవరీ కేసులు 2,98,826 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,671 మంది మృతిచెందారు..

Related posts