telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నా రాజీనామా గురించి మాట్లాడితే కాళ్ళు పట్టుకొని బండకు కొడతా…

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రశేఖరరావు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. నేనే సీఎం గా ఉంటాను..నేను ఆరోగ్యం గానే ఉన్నానని అయన తేల్చి చెప్పారు. కేటీఆర్ సీఎం అవుతున్నారనే అంశం మీద స్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడ్తున్నారని ప్రశ్నించారు. ఏప్రిల్ లో పార్టీ  బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్న ఆయన ఈ నెల12 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చ్ ఒకటి నుండి పార్టీ కమిటీల నియామకం ఉంట్నుందని అన్నారు. 11 న మేయర్ ఎన్నికలకు అందరూ తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్ లతో కలిసి జిహెచ్ ఎంసీ వెళ్ళాలని, సీల్డ్ కవర్ లో మేయర్,డిప్యూటీ మేయర్ అభ్యర్థులు పేర్లు ఉంటాయని, జిహెచ్ ఎంసీ లొనే కవర్ ఓపెన్ అవుతుందని అన్నారు. సీఎం మార్పు గురించి ఇకపై ఎవరు మాట్లాడవద్దన్న ఆయన… గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు.

Related posts