telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భార‌త్ త‌న వంతు క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించింది: యూఎన్ చీఫ్‌

Gguterras uno

కరోనా వైరస్ నియంత్ర‌ణ‌కు భార‌త్ త‌న వంతు క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించిద‌ని ఐక్యరాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుటెర్ర‌స్ అభినందించారు. పలు దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి యాంటీ మ‌లేరియా మందుల‌ను అవ‌స‌ర‌మైన దేశాల‌కు పంపిణీ చేసిందని మెచ్చుకున్నారు. అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌.. కోవిడ్‌19 చికిత్స‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు అని గుర్తించింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి డ్ర‌గ్‌ను సుమారు 1500 మంది పేషెంట్ల‌పై న్యూయార్క్‌లో ప్ర‌యోగించారు. ఈ నేప‌థ్యంలో గుటెర్ర‌స్ ప్ర‌పంచ‌దేశాల సంఘీభావాన్ని కోరారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్య‌ర్థ‌న మేర‌కు అమెరికాకు కూడా భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక దేశం మ‌రో దేశానికి వీలైనంత సాయం చేయాల‌న్నారు. అలా చేస్తున్న దేశాల‌కు తాను సెల్యూట్ చేస్తున్న‌ట్లు గుటెర్ర‌స్ పేర్కొన్నారు.

Related posts