కరోనా కారణంగా గతేడాది యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మాత్రం చెక్క చెదరలేదు. ఇండియా మోస్ట్ వాల్యూబుల్ సెలెబ్రిటీ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకొని రారాజుగా నిలిచాడు. 2020కి సంబంధించిన అత్యంత విలువైన ప్రముఖుల జాబితాను డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో రూ.1733 కోట్లతో భారత కెప్టెన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్‌లు ఉన్నారు. ప్రముఖుల బ్రాండ్ వ్యాల్యూయేషన్ 6వ ఎడిషన్ ప్రకారం.. విరాట్ తర్వాత రూ. 866 కోట్ల బ్రాండ్ విలువతో (గతేడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ రూ.750 కోట్ల బ్రాండ్ విలువను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగో స్థానంలో బాలీవుడ్ బాద్షా.. రూ.372.5 కోట్ల బ్రాండ్ వాల్యూతో ఉన్నాడు. కరోనా సంక్షోభంలోనూ కోహ్లీ బ్రాండ్ విలువ అదే విధంగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలోని టాప్-20 సెలబ్రిటీలు వారి విలువలో 5 శాతాన్ని కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.
previous post