telugu navyamedia
తెలంగాణ వార్తలు

బ్రేకింగ్ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవ అరెస్ట్

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌ రావు తనయుడు వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో వనమా రాఘవను కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవపై పాల్వంచ పీఎస్‌లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎంత కలకలం రేపింది. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.

Suspend Vanama Venkateshwar Rao from TRS - Great Telangaana | English

పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారైనట్టు రాఘ‌వ‌ను నిన్నటి నుంచి పోలీసులు రాఘవ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.  ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగ లేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి నియోజకవర్గానికి రాఘవేంద్రను దూరం పెడుతానని చెప్పారు.

ఈ క్రమంలో ఎట్టకేలకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రాఘవను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రాఘవను కొత్తగూడేనికి తరలిస్తున్నారు. బెయిల్ కు అప్లే చేసిన రాకుండా కౌంటర్ ఫీల్ దాఖలు చేస్తామంటున్నారు పాల్వంచ ఎఎస్పీ.

Related posts