telugu navyamedia
ఆరోగ్యం

థర్డ్ వేవ్ తో జాగ్రత్త- తీసుకోవాల్సి జాగ్ర‌త్త‌లు ఇవే..

ప్రస్తుతం దేశంలో క‌రోనాతో పాటు ఒమిక్రేన్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిది. మీ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపించగానే.. టెస్టుల కన్నా ముందే అతను మిగతా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్లో ఉండాలి.

అలాగే సాధారణ జ్వరం, దగ్గు మాములు లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది. లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి.

అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు, వేడుకలకు అస్సలు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది. ముఖ్యంగా ముందు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఒకరికి వస్తే అందరికీ సోకే ప్రమాదం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..

* 01 కడుపులను ఖాళీగా ఉంచకండి ..
* 02 ఉపవాసం చేయవద్దు ..
* 03 రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి..
* 04 ఎసి ఉపయోగించవద్దు ..
* 05 వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి..
* 06 ముక్కుకు ఆవ నూనె రాయండి ..
* 07 ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి ..
* 08 ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి..
* 09 దాల్చినచెక్క వాడండి..
* 10 రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి..
* 11 వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి…
* 12 ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి..
* 13 ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి ..
* 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి ..
* మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి..
* పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

Related posts