telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రోదసిలో .. సిమెంట్ మిక్స్ చేసిన .. నాసా…

cement mix in space by nasa

తొలిసారిగా పరిశోధకులు రోదసిలోని సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో సిమెంటును కలిపారు. భూకక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ఇందుకు వేదికైంది. దీనివల్ల భవిష్యత్‌లో విశ్వంలోని హానికారక రేడియోధార్మికత, అసాధారణ ఉష్ణోగ్రతల నుంచి మానవులను రక్షించడానికి వీలవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ తెలిపింది. భూమి మీద నిర్మాణ రంగంలో కాంక్రీటును విరివిగా ఉపయోగిస్తుంటారు.

తాజా ప్రయోగం ద్వారా ఈ ప్రక్రియకు సంబంధించిన రసాయన తీరుతెన్నులు, సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం వల్ల ఈ కాంక్రీటులో సూక్ష్మనిర్మాణాలు చోటుచేసుకుంటున్నాయా అనే అంశాలను పరిశీలించాలన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం. తాజా ప్రయోగంలో సిమెంటులోని ప్రధాన పదార్థమైన ట్రైక్యాల్షియం సిలికేట్‌ను తొలిసారిగా భూమి గురుత్వాకర్షణ శక్తికి వెలుపలి ప్రాంతంలో నీటితో కలిపారు. వివిధ రకాల మిశ్రమాల్లో దీన్ని సిద్ధం చేశారు. భూమి మీద కలిపిన సిమెంటుతో పోలిస్తే వీటిలో గణనీయ మార్పులను గుర్తించారు.

Related posts