telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మహిళల భద్రత కోసం..ఉచిత ట్రాన్స్ పోర్ట్ .. ఈ నెంబర్లకు కాల్ చేయండి..

free ride on nights to women

పోలీసులు మహిళల భద్రత కోసం మరో ముందడుగు వేశారు. ఆడవాళ్లు ఏదైనా పని మీద రాత్రి ఇంటికి వెళ్లడం లేట్ అయినా లేక బస్సు దొరక్క ఇబ్బంది పడినా ఓ ఫోన్ చేస్తే చాలు, పోలీస్ వాహనం మీ ముందు నిలుస్తుంది. అది కూడా ఉచితంగా, సేఫ్‌గా ఇంటి వద్ద డ్రాప్ చేస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. ‘దిశ’ హత్యాచారం కేసు తర్వాత అటు పోలీసులు.. ఇటు మహిళలు పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు.. మహిళల భద్రత కోసం.. ప్రత్యేకమైన యాప్‌లు, ఫోన్ నెంబర్లను కేటాయించారు. అంతేకాకుండా.. ఓ సపరేట్ టీం కూడా వీటిని పర్యావేక్షిస్తున్నారని అధికారులు తెలియజేశారు.

దిశ ఘటన తర్వాత రాత్రివేళల్లో మహిళలు ఇబ్బందులు పడుతుండటంతో పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ని ప్రారంభించారు. రాత్రి 10 నుంచి 6 గంటల మధ్య రాత్రి ఒంటిరిగా ఇంటికి వెళ్లటానికి.. వాహనం దొరకని మహిళలు.. పోలీస్ హెల్ప్‌ లైన్ నెంబర్లకు 1091, 7837018555కి కాల్ చేసి వాహనం కావాలని అభ్యర్థించవచ్చు. వీరు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం కానీ.. ఎస్‌హెచ్‌ఓ వాహనం కానీ వచ్చి సదరు మహిళను వారి ఇంటి వద్ద భద్రంగా డ్రాప్ చేస్తారని.. కాగా.. ఈ సర్వీసులు పూర్తిగా ఉచితమని పోలీసులు తెలిపినట్టు.. ఓ వార్త జోరుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related posts