telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో… నాగ చైతన్య

nagachitanya

వెంకీ మామ తో సూపర్ హిట్స్ సాధించిన నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘లవ్‌స్టోరి’ సినిమా చేస్తున్నాడు.అయితే నాగ చైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని ఫిలింనగర్ టాక్. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన విక్రమ్ తర్వాత అఖిల్ హీరోగా ‘హలో’ చిత్రం చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. చైతు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ డిఫరెంట్ స్టోరి రెడీ చేసి వినిపించగా చైతు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మనం’ తర్వాత వీళ్ల కాంబోలో రానున్న రెండో సినిమా ఇది. ఈ మూవీ కోసం ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ఫిలించాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం.

Related posts