telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

కొత్త పరీక్షా విధానం వచ్చేసింది.. వాట్స్అప్, మెయిల్ ద్వారా ..

jnu exams through whatsapp and mail

ఎక్కడో ఒకచోట మార్పు తప్పదు.. కొత్తనీరు రావాల్సిందే, పాతనీరు పోవాల్సిందే. కాలానుగుణంగా ప్రతిదానిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. దానిని మొదటిగా అనుభవించేవారికి కొత్తగా ఉండొచ్చు, ఆ తరువాతివారు అలవాటుపడిపోతారు. అలాంటి విప్లవాత్మకమైన మార్పులు విద్యావ్యవస్థలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. పరీక్షా విధానాలలో కూడా ఆయా మార్పులు జరుగుతుండటం చూస్తున్నాం. తాజాగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ(జేఎన్‌యూ) విద్యార్దులు ఈ దఫా సెమిస్టర్ పరీక్షలను వినూత్నమైన రీతిలో రాయనున్నారు.

ప్రస్తుతం ఫీజుల పెంపునకు నిరసనగా జేఎన్‌యూ విద్యార్ధులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో విద్యార్ధులు యూనివర్సిటీకి రావడంలేదు. ఈ క్రమంలో… త్వరలో జరగాల్సి ఉన్న సెమిస్టర్ పరీక్షలను కొత్తగా నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రశ్నాపత్రాలను నేరుగా విద్యార్దుల వద్దకే పంపించనున్నారు. ఆ తర్వాత… విద్యార్దులు తమ జవాబులను వాట్సాప్, ఈ మెయిళ్ళ ద్వరా పంపించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. విద్యార్దుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

Related posts