telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

తన తండ్రి వైఖరికి విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వైయస్ రాజశేఖర రెడ్డి తిరగతోడలేదని, అందుకే హైదరాబాద్, సైబరాబాద్ లాభపడ్డాయని చెప్పారు. పోలవరం విషయంలో హైకోర్టు తీర్పు జగన్ తొందరపాటు చర్యలకు నిదర్శనమని చెప్పారు. అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును కొట్టేయాలని జగన్ చూశారని ఆరోపించారు.

ఇప్పటికైనా జగన్ తన తప్పు తెలుసుకోవాలని సూచించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను కలపడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పారు.వరదల నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అంచనా కూడా వేయలేకపోయిందని విమర్శించారు. వరద తీవ్రతకు 6 వేల ఎకరాలు నీట మునిగాయని అన్నారు. పంటను కోల్పోయి 10వేల రైతు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. 

Related posts