ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కరోనా నుంచి కోలుకున్నారు. 10 రోజుల క్రితం బలరాంకు కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆయన కంటే ముందే ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా కరోనా బారిన పడ్డారు.
హోం ఐసొలేషన్ లోనే చికిత్స తీసుకుని వెంకటేశ్ కోలుకున్నారు. కానీ, బలరాం పరిస్థితి సీరియస్ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నెగెటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే వయసు కారణాల రీత్యా హైదరాబాదులోని తన నివాసానికే కొన్నాళ్ల పాటు బలరాం పరిమితం కానున్నారు.