telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వసూళ్లతో హుషారుగా ఉన్న .. ఇస్మార్ట్‌ శంకర్‌.. 3రోజుల్లో 36కోట్లు..

Ismart-Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా, వచ్చిన మాస్‌ మసాలా ఎంటర్‌ టైనర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, విడుదలైన మూడు రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్స్ రూ. 36 కోట్లకు పైనేనని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆదివారం కూడా కలెక్షన్లు బాగానే ఉండవచ్చని తెలుస్తుంది.

దీంతో తొలి వారంలోనే సినిమా కలెక్షన్లు రూ. 50 కోట్ల మార్క్ ను దాటుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాతో పూరీకి చాన్నాళ్ల తరువాత బిగ్ హిట్ రావడంతో ఆయా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Related posts