telugu navyamedia
సినిమా వార్తలు

58 సంవత్సరాల “మంగళసూత్రం”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం అరుణాచల స్టూడియోస్ వారి”మంగళసూత్రం” సినిమా 19-05-1966 విడుదలయ్యింది.

నిర్మాత, దర్శకుడు ఏ.కె. వేలన్ స్వీయ దర్శకత్వంలో అరుణాచల స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని
నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: పినిశెట్టి, పాటలు: కొసరాజు, శ్రీ శ్రీ, దాశరథి, సంగీతం: టి.చలపతిరావు, సినిమాటోగ్రఫీ: సత్యం, కళ: కె.వి.ముత్తు, నృత్యం: రెడ్డి,రాజ్ కుమార్, ఎడిటింగ్: వి.ఎన్.రఘుపతి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, దేవిక, వాసంతి, రమణారెడ్డి, పద్మనాభం, రమణమూర్తి, పెరుమాళ్లు, గీతాంజలి, హేమలత, నిర్మల తదితరులు నటించారు.

సంగీత దర్శకులు టి.చలపతిరావు గారి సంగీత సారథ్యం లో వచ్చిన పాటలు
“అందాల చిన్నదాన్ని చూడాలి”
“ఇది చీకటి జీవితం, శిధిలమైన జీవితం”
“భళే భళే పోసుకోలు బావయ్యో, చిట్టి బావయ్యో”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి

ఈ చిత్రం యావరేజ్ గా నడిచి విజయవాడ తో పాటు మరికొన్ని కేంద్రల్లో 50 రోజులు ప్రదర్శింపబడింది.

విజయవాడ – మారుతీ టాకీస్ లో 52 రోజులు ప్రదర్శింపబడింది …

Related posts