telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ .. కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్!

komati-venkat-reddy mp

తెలంగాణలో అధిక విద్యుత్తు బిల్లులకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు.

కరోనా సమయంలో ఇళ్ల అద్దెలు చెల్లించవద్దని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు శ్లాబుల పేరుతో ప్రజల నెత్తిన వేలాది రూపాయల బిల్లులు రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు పెద్దమొత్తంలో కరెంటు బిల్లులు ఎలా కడతారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్ట్ చేయడమెంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Related posts