గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించింది ప్రియాంక. తన భర్తకంటే తను పెద్దది కావడంతో కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, భార్య కంటే భర్త పెద్దవాడైనప్పుడు అభ్యంతరం ఉండదు. కానీ అమ్మాయిల విషయానికొచ్చేసరికి విమర్శలతో సిద్ధమైపోతారని అసహనం వ్యక్తం చేసింది. ఇక తన పెళ్ళి జీవితం గురించి మాట్లాడుతూ ”మొదట్లో బాగానే ఉండేవాళ్లం కానీ పెళ్లైన తరువాత అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఒక్కోసారి తను సర్దుకుపోతాడు. మరోసారి నేను. ఏం జరిగినా మన మంచికే అని చెబుతాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. తను నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటాడు” అంటూ తన భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.
previous post
next post
కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్