telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్” కోసం ఎవరూ సంప్రదించలేదు : శ్రద్ధాదాస్

Shraddhadas

ఇటీవల స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. నాల్గో సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే నిర్వాహకులు కొంత మంది సెలబ్రిటీలను లిస్ట్ ఔట్ చేసింది. కానీ వారెవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో హీరోయిన్ శ్రద్దదాస్ పేరు కూడా ఉంది. దీంతో ఆమె స్పందిస్తూ.. బిగ్‌బాస్ సీజన్‌-4 కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, తాను అందులో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రద్ధాదాస్‌ ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా ఇకపై తన గురించి అసత్యపు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది శ్రద్ధ.

Related posts