విశాఖపట్నం నుండి సింగపూర్‌కు విమాన సేవలను సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్ ప్రారంభించింది. ఈ సర్వీసులను వారానికి ఐదు సార్లు నడుపనుండి. ఈ విమానం సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి ఉదయం 5.40కి సింగపూర్ చేరుకుంటుంది. మళ్ళీ అవే రోజుల్లో సింగపూర్‌లో సాయంత్రం 8.45కి బయలుదేరి, రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇవేగాక విశాఖపట్నంతో పాటు కోయంబత్తూరు నుంచి విమాన సేవలను స్కూట్ ప్రారంభించింది.