telugu navyamedia
సినిమా వార్తలు

“ఊర్వశీ.. ఊర్వశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ” అంటూ స్టెప్పులేసి సల్మాన్… వీడియో వైరల్

Salman

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా హీరోహీరోయిన్లుగా “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. అయితే సల్మాన్ ఖాన్… తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఫిట్ నెట్, తన కుటుంబ జీవితం, కొత్త ప్రాజెక్టులు ఇలా అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవాతో కలసి సూపర్ హిట్ సాంగ్ “ఊర్వశీ.. ఊర్వశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ” సాంగ్ కు స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా కూడా వీరితో కలసి కాలు కదిపారు. వీరంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సల్మాన్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. “దబాంగ్-3” చిత్రంలో కిచ్చా సుదీప్ కూడా నటిస్తున్నాడు.

Related posts