telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ ఇంట్లోకి .. ట్రాన్స్‌జెండర్ తమన్నా .. పాటలు, డాన్సులు..

trans gender tamanna in bigg boss house

బిగ్ బాస్ లో ఒక ఎలిమినేట్ జరగటం, వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ఇంట్లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇవ్వడం, మొదటి రోజే సందడి చేయడం చకచకా జరిగిపోయాయి. చీరకట్టుతో తల కొప్పుకి మల్లెపూలు పెట్టుకొని సంప్రదాయబద్దంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అందరితో కలివిడిగా ఉంటూ ఇంట్లో పరిస్థితుల గురించి చర్చించింది. నామినేషన్ ప్రక్రియలోను పాల్గొన్న తమన్నా.. వరుణ్ సందేష్, వితికలని నామినేట్ చేసింది. శ్రీముఖి, రవికృష్ణల పర్యవేక్షణలో పలు స్టెప్పులు చేసి వావ్ అనిపించింది. ముందుగా క్లాసికల్ డ్యాన్స్‌తో శెభాష్ అనిపించిన తమన్నా వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేసింది.

శ్రీముఖి పాపులర్ స్టెప్ రాములమ్మ డ్యాన్స్ కూడా చేసింది. రవికృష్ణ ఓ ముత్యాల రెమ్మా.. అని పాట పాడుతుంటే తమన్నా అందుకు తగ్గట్టు స్టెప్పులు వేసి అలరించింది. హేమ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన తమన్నా.. రానున్న రోజులలో బుల్లితెర ప్రేక్షకులకి మరింత వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమన్నా సింహాద్రి డ్యాన్స్ ఎపిసోడ్‌ని హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

Related posts