telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భార్యకు మంగళసూత్రం కొనడానికి అమితాబ్ బిబికే షోకు వచ్చాడట… !

Amitab

కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వెళ్లాల్సిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇటీవల ఓ వ్యక్తి పాల్గొ్న్నాడు. అతని పేరు కుమార్ రంజన్. కేబీసీ షోలో పాల్గొనేందుకు బిహార్ నుంచి వచ్చాడు. ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో అమితాబ్ వారి లైఫ్ స్టోరీస్ అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అలా కుమార్‌ని కూడా అడిగాడు. ఈ షోలో గెలుచుకునే డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావ్ అని కుమార్‌ను బిగ్ బి ప్రశ్నించారు. ఇందుకు కుమార్ ఇచ్చిన సమాధానం విని అమితాబ్ షాకయ్యారు. వచ్చిన డబ్బుతో నా భార్యకు మంగళసూత్రం కొనివ్వాలని అనుకుంటున్నానని తెలిపాడు. దాంతో అతని మొత్తం స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు అమితాబ్. కుమార్ తన కథను వివరిస్తూ.. ‘నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే నా క్లాస్‌మెట్‌ను చూసి ఇష్టపడ్డాను. మేమిద్దరం ఒకే ట్యూషన్‌కు వెళ్లేవాళ్లం. తను ఒక్క రోజు ట్యూషన్‌కి, స్కూల్‌కి రాకపోయినా నాకు ప్రాణం పోయినట్లు అనిపించేది’ అని తెలిపాడు. ఇదంతా విని అమితాబ్ పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఈ షోకి ఎందుకు వచ్చాడో వివరిస్తూ.. ‘నా బేబీ(భార్య)కు మెడలో మంగళసూత్రం కూడా లేదు సర్. నేను చేసే ఉద్యోగంతో తనకు మంగళసూత్రం కొనడం చాలా కష్టం. అందుకే ఈ షోలో పాల్గొని వచ్చిన డబ్బుతో తన మెడలో మంగళసూత్రం వేయాలని అనుకుంటున్నాను’ అన్నాడు. అతను కోరుకున్నంత డబ్బు గెలుచుకోవాలని అమితాబ్ కూడా విష్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts