telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టెన్త్, ఇంటర్ పరీక్షలపై సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

cm jagan ycp

జగనన్న వసతి దీవెన పథకాన్ని సిఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ఏ సందర్బంగా పది, ఇంటర్ పరీక్షలను వాయిదా లేదా రద్దు వేయాలన్న డిమాండ్ పై సిఎం జగన్ స్పందించారు. “పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంది. పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుంది. పాస్ సర్టిఫికెట్లలతో మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయా ?విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు. విధ్యార్థులకు నష్టం చేయబోము” అని సిఎం జగన్ పేర్కొన్నారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని సిఎం జగన్ చెప్పారు. ఆయన మాటలు చూస్తుంటే.. పది, ఇంటర్ పరీక్షలను కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత నైనా నిర్వహించేలా కనిపిస్తున్నారు.

పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పిల్లల తలరాతలు మార్చాలనే తపనతోనే అనేక పథకాలు అమలు చేస్తున్నామని..విద్యారంగంలో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవాలనే సంకల్పంతో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నామని.. నాడు నేడు కింద రాష్ట్రంలో పాఠశాలు ,అంగన్వాడీల రూపురేఖలను మార్చుతున్నామన్నారు. ప్రతి పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్నామని.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కోసం 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. పిల్లల్లో నైపుణ్యాభివృద్ది పెంపోందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని..డిసెంబర్ లో రెండో విడత వసతి దీవెన నిధులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్.

Related posts