telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : ఒవిలియా పాత్ర ఇదేనా ?

britan beauty with junior ntr in rrr movie

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లకు జోడీగా ఒలివియా మోరిస్ మరియు ఆలియా భట్ లు నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ భామ ఒలివియాకు సంబందించిన పాత్ర విషయంలో ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఒలివియా బ్రిటీష్ యువతి పాత్రలో కనిపించబోతుందట. ఎన్టీఆర్ తో ప్రేమలో పడి.. భీమ్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విధానానికి ఫిదా అయ్యి, ఇండియా కోసం పుట్టిన దేశాన్ని, కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇండియాకే పరిమితం అయ్యి కొమురం భీమ్ తో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటుందట.ఈ క్రమంలో కొమురం భీంతో ప్రేమలో పడుతుందని ఆయన్ను పెళ్లి చేసుకుంటుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related posts