telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ్ వెబ్ సిరీస్ “గాడ్ మ్యాన్” బ్యాన్.. ఎందుకంటే ?

God-Man

ప్రస్తుతం వెబ్ సీరీస్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. వెబ్ సిరీస్ లలో బోల్డ్ కంటెంట్ ఉన్నా కూడా సెన్సార్ ఉండకపోవడంతో సినీ ప్రేమికులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా తమిళ్ వెబ్ సిరీస్ “గాడ్ మ్యాన్”ను బ్యాన్ చేశారు. డబ్బు – అధికారం – దేవుడు – సెక్స్ అనే అంశాల చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ ని తెరకెక్కించింది జీ5. సనాతన హిందూ ధర్మాన్ని, బ్రాహ్మనిజాన్ని కించపరిచే కథాంశంతో వెబ్ సిరీస్ ఆద్యంతం వేడెక్కించేస్తుందిట. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ కంటెంట్ పూర్తిగా వివాదాస్పదమైనది. ఈ సిరీస్ ఇంకా స్ట్రీమింగ్ కు రాలేదు. ట్రైలర్ మాత్రమే విడుదలైంది. ఈ ట్రైలర్ లో వివాదాస్పద కంటెంట్ ఉంది అంటూ తమిళనాట రచ్చ మొదలవ్వడంతో జీ5 స్ట్రీమింగ్ చేయకుండా ఆపేసింది. ప్రస్తుతం ఆ సిరీస్ దర్శక నిర్మాతలపై పోలీసు కేసు పెట్టారు. ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

Related posts